ఓం నమో నారాయణాయ
అంతా విష్ణువే
శ్రీ మహా విష్ణువు ను సర్వశక్తి వంతుడు,సర్వ వ్యాపి అనగా
సర్వాంతర్యమి, సర్వజ్ఞుడు అనగా అంతా తెలిసినవాడు అని అందురు.
శ్రీ విష్ణువు నుండే సకల చరాచర సృష్ఠి ఏర్పడినది దీనికి నిదర్శనంగా ఈశ్వరుడిని శ్రీవిష్ణు రూపాయ నమశివాయ అందురు అనగా విష్ణువు యొక్క రూపమే శంకరుడు. ఇదేవిధంగా శ్రీ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని ముడుమూర్తుల తిరుమలేశా అందురు మూడు మూర్తులు అనగా విష్ణువు, బ్రాహ్మ మరియు విష్ణువు యొక్క స్త్రీ స్వరూపం భూదేవి అనగా మనోన్మని దేవి వీరి ముగ్గురినే శ్రీ వేంకేశ్వరస్వామి అందురు ఇందు విష్ణువు ద్విలింగి అనగా నేనే పుషుడు నేనే స్త్రీ అని భావం దీనికి గురుతుగానే పురుష మానవుని DNA లో X,Y క్రోమోజోములు ఉండును అనగా పుషుడి నుండే స్త్రీ సృష్టించ బడినది అనగా ఆదిపరాశక్తి అని అర్థం మరియు శ్రీ వెంకటేశ్వర స్వామిని కల్కి రూపే అందురు, కల్కి అనగా విష్ణువు మరియు బ్రహ్మ అనగా బ్రాహ్మ కూడా విష్ణువే.
అనగా విష్ణువు మనిషి మరియు దైవం. అనగా దైవం మానష రూపేణా అనగా మనిషి దేవుడు రూపం అని అర్థం.
ఆ విష్ణువు నుండి సకల చరాచర సృష్టి ఏర్పడినది ఈ సృష్టిలో గల ప్రాణులన్నీ మరియు ప్రాణులకు ఆధార భూతమైన పంచ భూతాలు అన్నీ విష్ణువు నుండే ఏర్పడెను అందులకే విష్ణువును సర్వాంతర్యామి అందురు.